CHANDRANNA VILLAGE MALLS, Srinivasaraothota, Guntur

గుంటూరు శ్రీనివాసరావుపేటలో ఏర్పాటు చేసిన చంద్రన్న విలేజ్ మాల్ ను పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రన్న మాల్ లో ఉన్న వివిధరకాల వస్తువుల ధరలు, వాటి నాణ్యతను పరిశీలించారు.ముందు ముందు చంద్రన్న మాల్స్ లో చాలా మార్పులు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత10 రోజులలో అన్ని మార్కెట్లను పరిశీలించి చంద్రన్న మాల్స్ లో 63 రకాల సరుకులను రివైజ్డ్ చేశామన్నారు. చంద్రన్న మాల్స్ పై పూర్తి…

CRANE RELEGION TRUST ANNADANAM, Guntur

గుంటూరు సంపత్ నగర్ లో క్రేన్ రిలీజియన్ ట్రస్టు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అయ్యప్పస్వాములు, భక్తుల అన్న సమారాధన కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వాములు, భక్తులకు భోజనం వడ్డించారు. అందరితో కలిసి మంత్రి పుల్లారావు, మద్ధాలి గిరి, చిట్టిబాబులు భోజనం చేశారు. క్రేన్ ట్రస్టు వారు గత 30 సంవత్సరాకు పైగా నిర్వహిస్తున్న సేవలను కొనియాడారు.

Christmas Celebrations at LEM School, Guntur

పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు రాష్ట్ర ప్రభుత్వం తరుపున గుంటూరు ఎల్.ఈ.ఎం పాఠశాల గ్రౌండ్ లో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లను మంత్రి నక్కా ఆనందబాబు గారితో కలిసి పరిశీలించారు. ఈ వేడుకలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా నాయకులు, క్రైస్తవ సంఘాలు, మత పెద్దలు, ప్రజాసంఘాల వారు పాల్గొంటారు.

SEMI CHRISTMAS CELEBRATIONS AT CHILAKALURIPET 2nd WARD

చిలకలూరిపేట 2వ వార్డులో క్రిస్మస్ వేడుకలలో పాల్గొని కె మహెష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసిన మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు.

ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్

ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట AMG స్కూలు నందు ఇటీవల విడుదల అయిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 10/10 జీపిఏ సాధించిన చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన 27 మంది విద్యార్థులను అభినందించిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.నాణ్యమైన విద్యాను అందించి 100% ఉత్తీర్ణతకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ప్రతిభా పురస్కరాలతో సత్కరించిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు.